ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పై దాడి చేసిన 5గురు వ్యక్తులపై కేసు నమోదు

గోల్డెన్ న్యూస్ /  జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు రేంజ్ పరిధిలోని, పాపకొల్లు బీట్- బీ పరిధిలోగల రాసగానిగుట్ట కంపార్ట్మెంట్ నెంబర్ 31 ప్రాంతంలో,తేదీ 29.08. 2025న ఉదయం 11.00 గంటల సమయంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్  కొలిచలం విజయలక్ష్మి , ప్లాంటేషన్ వాచర్ అయిన తేజావత్ రాము కలిసి విధులు నిర్వహిస్తుండగా, కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మారుజాతి మొక్కలను నరికి వేసి ఉండడాన్ని గమనించినారు,  ఫారెస్ట్ కవర్ రేంజ్ పాయింట్ కనుక ఆ ప్రదేశంలో మొక్కలు నాటవలసి యున్నది కనుక,పై అధికారుల ఆదేశానుసారం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు వాచర్ లు ఇద్దరు కలిసి మొక్కలు నాటుచుండగా, మొక్కలు నాటుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎలకలోడ్డు గ్రామానికి చెందిన మడి సీతారాములు,మడి ప్రవీణ్,మడి ముత్తమ్మ లు అచ్చటకు వచ్చి మొక్కలు నాటడానికి వీల్లేదు,  గుత్తి కోయలు ఇలానే చెట్లను నరికి సాగు చేసుకుంటారు, మీరు అడ్డు చెబితే మీ సంగతి చూస్తాం, మిమ్ములను చంపుతామంటూ బెదిరించి భయభ్రాంతులకు గురిచేసి, మొక్కలు నాటకుండా అడ్డగించి, విధులకు ఆటంకం కలిగించినారని, గుత్తి కోయ మహిళ మడివి హీడిమా ను రెచ్చగొట్టి, తనపై దాడికి ఉసిగొల్పినాడని, సదరు మహిళ రాయితో తన ను రెండు దెబ్బలు గట్టిగా కొట్టి ,జుట్టు పట్టుకొని లాగి కింద పడేసిందని, తమ వాచర్ వీడియో చిత్రీకరిస్తుంటే, వారంతా వాగు దాటి పారిపోయారని, కాసేపటికి బచ్చల నరసమ్మ అనే మహిళ కూడా తమ వద్దకు వచ్చి, దురుసుగా ప్రవర్తించి ,అసభ్య పదజాలంతో దూషించి, చంపుతా అంటూ బెదిరించినదని, అటవీ శాఖ  అనుమతి లేకుండా ,అటవీ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి, 15 వేల రూపాయల విలువ చేసే చెట్లను నరికి, పత్తి పంట సాగు చేస్తుండగా అనుమతి లేకుండా పంటలు వేశారని ప్రశ్నించినందుకు, తమను బూతులు తిట్టి రాళ్లతో కొట్టి గాయపరిచి, మొక్కలు వేయనీయకుండా తమ విధులకు ఆటంకం కలిగించి, మరో మారు తమను ప్రశ్నిస్తే చంపుతామని బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసిన, మడి సీతారాములు, ప్రవీణ్, ముత్తమ్మ , హీడిమా, నరసమ్మలపై చట్టరీత్య చర్య కొరకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్  విజయలక్ష్మి( 30)  ఫిర్యాదు మేరకు జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాాప్ దర్యాప్తు జరుపుుతున్న  ఎస్ ఐ రవి తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram