చోరీ చేసిన హుండీ, నగదును నెల తరవాత ఆలయంలో తెచ్చి పెట్టిన దొంగలు

గోల్డెన్ న్యూస్ / ఆంధ్ర ప్రదేశ్ : అనంతపురంలోని బుక్కరాయసముద్రంలో ఉన్న ముసలమ్మ ఆలయ హుండీని నెలక్రితం దొంగలు ఎత్తుకెళ్లగా, అందులోని డబ్బుతో సహా ఓ లేఖను గురువారం రాత్రి తిరిగి తెచ్చి అక్కడే పెట్టి వెళ్లారు. “తప్పయింది అమ్మా, నలుగురం కలిసి దొంగతనం చేశాం. దీనివల్ల నా కొడుకు అనారోగ్యం బారిన పడ్డాడు. కొంచెం డబ్బు వాడుకున్నాను. క్షమించండి,” అని ఆ లేఖలో పేర్కొన్నారు. వదిలి వెళ్లిన మొత్తం నగదు రూ.1,86,486గా ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram