మహిళలు ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం పంచాయతీ పెట్టుకోవడం….జుట్లు జట్లు పట్టుకొని కొట్టుకోవడం చూసాం..
గోల్డెన్ న్యూస్ /మహబూబాబాద్ : మహిళలు ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం పంచాయతీ పెట్టుకోవడం.జుట్లు జట్లు పట్టుకొని కొట్టుకోవడం చూసాం..మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో యూరియా బస్తాల కోసం 2 మహిళలు జుట్లు జుట్లు పట్టుకొని పొట్టు..పొట్టుగా కొట్టుకున్నారు. ప్రధాన రహదారిపై పొర్లాడుతూ కొట్టుకోవడం అందర్నీ విస్మయపరిచింది. చుట్టుపక్కల వారు ఆపుతున్నా ఆగకుండా కొట్టుకున్నారు. చివరకు ఇద్దరు వ్యక్తులు ధైర్యం చేసి ఆ ఇద్దరు మహిళలను బలవంతంగా ఆపారు. మహబూబాబాద్ పట్టణం లోని వివేకానంద సెంటర్ లో గల ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ముందు మహిళలు , పురుషులు ఆధార్ కార్డు జిరాక్స్ లు పట్టు కొని పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఒకరికొకరు నెట్టుకోవడంతో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ఈ సమయంలోనే ఇద్దరు మహిళలు తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ దృశ్యాలు వాట్సప్ లో వైరల్ గా మారాయి









