పిడుగుపాటుకు 8 మంది దుర్మరణం

రాష్ట్రంలోని పలుచోట్ల బుధవారం పడిన పిడుగుపాట్లకు ఎనిమిది మంది దుర్మరణం చెందారు. ఇందులో నలుగురు రైతులు, ముగ్గురు వ్యవసాయ కూలీలు, మరో వ్యక్తి ఉన్నారు.

గోల్డెన్ న్యూస్ /ఖమ్మం :రాష్ట్రంలోని పలుచోట్ల బుధవారం పడిన పిడుగుపాట్లకు ఎనిమిది మంది దుర్మరణం చెందారు. ఇందులో నలుగురు రైతులు, ముగ్గురు వ్యవసాయ కూలీలు, మరో వ్యక్తి ఉన్నారు. నిర్మల్ జిల్లాలో ముగ్గురు, జోగులాంబ గద్వాల జిల్లాలో ముగ్గురు, ఖమ్మం జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం సాయంత్రం వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో ఈ విషాద ఘటన  నెలకొంది. మధిర, సత్తుపల్లి, గుండాల మండలాల్లో పిడుగుపాటుకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. టేకులపల్లి, కామేపల్లి మండలాల్లో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram