బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు లైన్ క్లియర్

తెలంగాణలో 42శాతం BC రిజర్వేషన్కు లైన్ క్లియర్ అయ్యింది. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. 

తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు గవర్నర్ ఆమోద ముద్ర వేసారు. రిజర్వేషన్ల కోసం తాజాగా తీసుకొచ్చిన పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్ట సవరణకు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. దీంతో, తెలంగాణలో 50 శాతం రిజర్వేషన్ల క్యాప్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గజెట్ జారీ కానుంది. ఇక, రిజర్వేషన్ల అంశం తేలటంతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. ఇటు ప్రభుత్వం జీవోలు సైతం జారీ చేసింది.

Facebook
WhatsApp
Twitter
Telegram