సతీష్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : కరకగూడెం గ్రామానికి చెందిన ఆడపు సతీష్ కొద్ది రోజుల క్రితం ట్రాక్టర్ కి పంచర్  వేస్తుండగా ప్రమాదానికి గురై  తలకు బలమైన గాయం కావడంతో తలకు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న సతీష్ ను గురువారం ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రావు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు  పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram