గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : మండలంలోని చెప్పాల పంచాయితీ శ్రీరంగాపురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు జాడీ రామనాథం,ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు జాడి మురళీధర్,జాడి నరసింహారావు మాతృమూర్తి జాడి లక్ష్మి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. గురువారం ఎమ్మెల్సీ తాతా మధు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, దశదినకర్మలకు హాజరై వారి నివాసానికి వెళ్లి లక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మృతులాలి కుటుంబ సభ్యులకు ఇరువురు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Post Views: 102









