జీవో నెంబర్ 64 అమలు నిలిపివేయాలి
హాస్టల్ వర్కర్లను పర్మినెంట్ చేయాలి
జేఏసీ డిమాండ్
గోల్డ్ న్యూస్ న్యూస్ / కరకగూడెం : గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు కొమరం కాంతారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం చిరుమల గిరిజన ఆశ్రమం పాఠశాలలో పనిచేస్తున్న రోజువారి కార్మిక కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నిరవేదిక సమ్మెలో సిఐటియు నాయకులు కొమర కాంతారావు పాల్గొని జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెను ప్రారంభించి ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ.. రోజువారి కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని. జీవో నెంబర్ 64 రద్దు వరకు ఈ సమ్మె కొనసాగుతుందని తెలియజేశారు హాస్టల్ వర్కర్లను తక్షణమే పర్మినెంట్ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు ప్రభుత్వం వీరి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని నెలల తరబడి వేతనాలు పెండింగ్లో ఉంచడం ఎంతవరకు సబమని ప్రశ్నించారు ఇదివరకే ఇస్తున్న వేతనాల్లో కోత విధించడం ఎంతవరకు కరెక్ట్ అని జీవో నెంబర్ 64 ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు పెండింగ్లో ఉండమని వేతనాలు తక్షణమే చెల్లించాలని కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు ప్రభుత్వం తక్షణమే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మాదాస్ అఖిల్, హాస్టల్ డైలీ వేజ్ వర్కర్లు కొమరం ముసలయ్య, ఏడూల్ల పాపయ్య,చర్ప చంటి, చంద్రకళ, నాగమణి తదితరులు పాల్గొన్నారు









