గోల్డెన్ న్యూస్ / దమ్మపేట : కోళ్ల దొంగతనం కేసులో విచారణకు వచ్చిన ఏలూరు జిల్లా చింతలపూడి పోలీసులు విచారణ పేరుతో మహిళను ఇబ్బందులకు గురిచేసారని స్థానికులు ఆరోపించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రానికి కోళ్ల దొంగతనం కేసులో విచారణకు వచ్చామంటూ ఒక మహిళ ఇంట్లోకి అనుమతి లేకుండా వెళ్ళి, సీసీ కెమెరాలను తొలగించారని గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులకు సమాచారమివ్వకుండా, విచారణ పేరుతో మహిళలు అని కూడా చూడకుండా ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. ఏపీ పోలీసులను నిర్బంధించిన స్థానికులు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వకుండా ఏ విధంగా వచ్చారని నిలదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Post Views: 34









