తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ

గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్ శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి బుధవారం సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేసింది, మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,743 కాగా. ఇందులో డ్రైవర్ కొలువులు ఒక 1,000స్రామిక్ పోస్టులు 743 ఉన్నాయి, అక్టోబర్ 8వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. గతంలో ఈ పోస్టులను ఆర్టీసీ సంస్థ నే ఈ ఉద్యోగాల్ని భర్తీ చేసేది,కాని ఇప్పుడు ఈ డ్రైవర్, శ్రామిక్, పోస్టుల భర్తీని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కు అప్పగించారు.

 

డ్రైవర్ పోస్టులకు 22 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు శ్రామిక్ ఉద్యోగాలకు 18 నుంచి 30 సంవత్సరాల వరకు వయోపరిమితి ఉంది, ఎస్సీ, ఎస్టీ, బిసి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు మూడేళ్లు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

 

నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే.

 

డ్రైవర్ ఉద్యోగాలకు జీతం రూ.29,960 నుంచి స్టార్ట్ అవుతుందని పేర్కొన్నారు. ఇక శ్రామిక్ పోస్టులకు నెలకు జీతం రూ.16,550 నుంచి రూ.45,030 వరకు ఉంటుందని తెలిపారు.

 

డ్రైవర్ పోస్టుల్లో జిల్లాల వారీగా పోస్టులు ఇలా ఉన్నాయి.

 

ఆదిలాబాద్ జిల్లాలో 21, మంచిర్యాల 24, నిర్మల్ 21, ఆసిఫాబాద్ జిల్లాలో 15 పోస్టులు ఉన్నాయి. ఇక కరీంనగర్ జిల్లాలో 12, పెద్దపల్లి జిల్లాలో 10, జగిత్యాల 11, సిరిసిల్ల 7, భూపాలపల్లి 5, ములుగులో 3 పోస్టులు ఉన్నాయి. మెదక్ 10, సిద్దిపేట 13, నిజామాబాద్ 49, కామారెడ్డి 30, ఖమ్మం 44, భద్రాద్రి కొత్తగూడెం 34, మహబూబ్ నగర్ 20, తోపాటు…

 

నాగర్ కర్నూల్ జిల్లాలో 20, గద్వాల 13, వనపర్తి 13, నారాయణపేట 13, నల్గొండ 31, సూర్యాపేట 22, యాదాద్రి భువనగిరి 15, వరంగల్ 29, హన్మకొండ 41, మహబూబాబాద్ 31, జనగాం 21, రంగారెడ్డి 88, మేడ్చల్ 93, వికారాబాద్ 34 ఇక అత్యధికంగా హైదరాబాద్ లో 148 పోస్టులు ఉండగా.. సంగారెడ్డి జిల్లాలో 59 పోస్టులు ఉన్నాయి.

 

శ్రామిక్ పోస్టుల వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లాలో 4, మంచిర్యాల 4, నిర్మల్ 4, ఆసిఫాబాద్ జిల్లాలో 3 పోస్టులు ఉన్నాయి. ఇక కరీంనగర్ జిల్లాలో 7, పెద్దపల్లి జిల్లాలో 06, జగిత్యాల 07, సిరిసిల్ల 04, భూపాలపల్లి 03, ములుగులో 02 పోస్టులు ఉన్నాయి. మెదక్ 1, సిద్దిపేట 1, నిజామాబాద్ 14, కామారెడ్డి 09, ఖమ్మం 18, భద్రాద్రి కొత్తగూడెం 14, మహబూబ్ నగర్ 04, నాగర్ కర్నూల్ జిల్లాలో 04, జోగులాంబ గద్వాల 03 , వనపర్తి 02, నారాయణపేట 02, నల్గొండ 20,

 

సూర్యాపేట 14, యాదాద్రి భువనగిరి 10, వరంగల్ 15, హన్మకొండ 21, మహబూబాబాద్ 15, జనగాం 10, రంగారెడ్డి 77, మేడ్చల్ 81, వికారాబాద్ 29 ఇక అత్యధికంగా హైదరాబాద్ లో 129 పోస్టులు ఉండగా.. సంగారెడ్డి జిల్లాలో 52 పోస్టులు ఉన్నాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram