గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్: బతుకమ్మ, దసరా పండగల నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఈ నెల 20 నుంచి అక్టోబరు 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 7754 ప్రత్యేక సర్వీసులను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో 377 స్పెషల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. అంతేకాకుండా పండగలకి సొంతూళ్లు వెళ్లినవారు తిరుగుపయనంలో ఎలాంటి ఇబ్బంది పడకుండా.. అక్టోబర్ 5, 6 తేదీల్లోనూ రద్దీకి అణుగుణంగా బస్సులు నడిపేందుకు సిద్ధమవుతోంది.
Post Views: 29









