ఆ మెడికల్ షాప్ పై చర్యలు తీసుకోవాలి

గోల్డెన్ న్యూస్ / వర్ని : ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మెడ్ ప్లస్ మెడికల్ షాపు పై, యాజమాన్యంపై చర్యలు తీసుకొని మెడికల్ షాపు లైసెన్స్ ను రద్దు చేయాలని బాధితులు డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీలత, శ్రీకాంత్ లకు ఫిర్యాదు చేశారు. వర్ని మండల కేంద్రంలోని మేడి ప్లేస్ లో గత మూడు రోజుల క్రితం ఓ ఆర్ ఎస్ ప్యాకెట్ లో చెత్త రావడం పట్ల వినియోగదారులు జిల్లా మెడికల్ డ్రగ్ ఇన్ స్పెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో, జిల్లా డ్రగ్స్ అధికారులు మెడికల్ లో విచారణ చేపట్టారు. ఓ ఆర్ ఎస్ పాకెట్లు కొనుగోలు చేసిన అక్బర్ నగర్ గ్రామానికి చెందిన షేక్ మహబూబ్, మహమ్మద్ గ్రామస్తులు డ్రగ్ ఇన్స్పెక్టర్ కలిసి నాణ్యత లేని వస్తువులను విక్రయిస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరించి దురుసుగా ప్రవర్తించిన మెడ్ ప్లస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, మెడికల్ లైసెన్సులు రద్దుచేసి మెడికల్ షాప్ ను మూసివేయాలని ఈ సందర్భంగా వారు డ్రగ్ ఇన్స్పెక్టర్ను కోరారు . డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీలత, శ్రీకాంత్ మెడికల్ లో ఉన్న మందులు, ఇతర వస్తువులను పరిశీలించి నాణ్యత ప్రమాణాలను సేకరించారు. మెడి ప్లస్ మెడికల్ లో బాధితులు కొనుగోలు చేసిన ఓఆర్ఎస్ ప్యాకెట్లను అధికారులు పరిశీలించారు. మెడికల్ లో ఉన్న డ్రగ్, ఫుడ్ ప్రొడక్ట్స్ ను తనిఖీ చేయడం జరిగిందని, తనిఖీ నివేదికను జిల్లా అధికారులకు అందజేయనున్నట్లు డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీలత, శ్రీకాంత్ వెల్లడించారు. ఈ సందర్భంగా షేక్ మహబూబ్ మాట్లాడుతూ మాకు జరిగిన అన్యాయం భవిష్యత్తులో ఇతరులకు జరగకుండా ఉండడానికి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి న్యాయపోరాటం చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్ని మాజీ సర్పంచ్ నేమాని వీర్రాజు, అబ్దుల్ సత్తార్, దాసు, జావీద్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram