గోల్డెన్ న్యూస్/ తెలంగాణ : నీటి సంపులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. బిహార్‌కు చెందిన సాహని బిట్టుకుమార్ కుటుంబం కరీంనగర్‌లోని బొమ్మకలో పైపుల ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. ఆదివారం సాయంత్రం ఆయన ఇద్దరు కుమారులు సత్యంకుమార్ (4), ఆర్యన్‌కుమార్ (2) ఫ్యాక్టరీ ఆవరణలోని నీటి సంపు వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. పిల్లలు కనిపించకపోవడంతో తల్లి నీటి సంపులో పరిశీలించగా అందులో పడిపోయి ఉన్నారు. వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయారు.
Post Views: 31









