గోల్డెన్ న్యూస్ /సూర్యాపేట : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు, రోగులకు మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలందిస్తున్న వైద్యాధికారులకు రక్షణ కల్పిస్తున్నాము జిల్లా ఎస్పీ నర్సింహా తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల భద్రత తనిఖీల్లో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ నర్సింహా ఐపీఎస్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి భద్రతను తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులు పోలీస్ శాఖతో సమన్వయంగా పనిచేయాలని ఎలాంటి మెడికో లీగల్ కేసులు నమోదు అయితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రి నందు అన్ని రకాల సదుపాయాలతో ప్రజలకు ఉచితమైన మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని ఇలాంటి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏదైనా సమస్య వస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని కానీ వైద్యాధికారులపై ఆసుపత్రి నిర్మాణాలపై, వైద్య పరికరాలపై ఎలాంటి దాడులకు పూనుకోవద్దని పరికరాలను ద్వసం చేయవద్దు అని అన్నారు, ఇలాంటి చర్యలు చట్టపరంగా నేరం అని హెచ్చరించారు. వైద్య సహాయం కోసం వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి వైద్యాధికారులను ఎస్పీ కోరారు . ఆసుపత్రి నందు పనిచేసే ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు వచ్చినా సంబంధిత అధికారుల వద్ద పరిష్కరించుకోవాలని ఇలాంటి విభేదాలకు, వివాదాలకు వెళ్ళవద్దని కోరారు.
అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో గల పోలీస్ అవుట్ పోస్టును పరిశీలించారు సిబ్బంది ఎల్లప్పుడు అందుబాటులో ఉండి ఎలాంటి కేసులు నమోదైన వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు తెలియపరచాలని రికార్డ్ నందు ప్రతి విషయాన్ని నమోదు చేయాలని సూచించారు, అంబులెన్స్ లకు, ప్రజల వాహనాలకు ఇబ్బంది కలగకుండా పార్కింగ్ చేయించాలని సూచించారు. మెడిపో లీగల్ కేసు నమోదు అయితే వెంటనే పోలీసు వారికి సమాచారం వచ్చేలా వైద్యాధికారులతో సమన్వయంగా పనిచేయాలని దీనిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రణాళిక తయారు చేయాలని సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ కు సూచించారు.
కార్యక్రమం ముందు ఎస్పి వెంట స్థానిక డిఎస్పి ప్రసన్నకుమార్ సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య స్పెషల్ బ్రాంచ్ వైద్యాధికారులు డాక్టర్ విజయ్ కుమార్, డా.వినయానంద్ డా.లక్ష్మణ్, డా.మనీషా మరియు పోలీస్ సిబ్బంది ఉన్నారు









