గోల్డ్ న్యూస్ /బాన్సువాడ : 108 అంబులెన్స్ అత్యవసర పరిస్థితుల్లో 108 సిబ్బంది స్పందించారు. అంబులెన్స్లలోనే ఓ మహిళకు డెలివరీలు నిర్వహించి తల్లీబిడ్డలను కాపాడారు. గాంధారి మండలం కరక్వాడి గ్రామానికి చెందిన మమతకు పురిటినొప్పులు ఎక్కువ కావడంతో మంగళవారంవ ఉదయం ఆమె భర్త మహేష్ 108 సిబ్బందికి ఫోన్ చేశాడు.
వెంటనే స్పందించిన అంబులెన్స్ సిబ్బంది రమేశ్, అస్లాం కలిసి మహేష్ ఇంటికి చేరుకుని కామారెడ్డి జీజీహెచ్కు తరలిస్తున్న సమయంలో మర్గమధ్యంలో ఆమెకు పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో వాహనాన్ని నిలిపేసి అంబులెన్స్లోనే నార్మల్ డెలివరీ నిర్వహించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. అనంతరం 198 ఈ ఆర్సీసీపీ వైద్యడు శివ సలహాతో ఆస్పత్రికి తరలించారు. అత్యవసర స్థితిలో స్పందించిన అంబులెన్స్ సిబ్బందికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 30









