సమ్మక్క – సారలమ్మను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

గోల్డెన్ న్యూస్ /ములుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలోని శ్రీ సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 12:30 గంటలకు హెలికాప్టర్ ద్వారా గద్దెల ప్రాంతానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు, మేడారం పూజారులు సాంప్రదాయ నృత్యాలు, డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు.

 

సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క, ఎస్సి, ఎస్టీ గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, మహబూబాబాద్, వరంగల్ పార్లమెంటు సభ్యులు పొరిక బాలరాం నాయక్, డా. కడియం కావ్య, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్., ఎస్పీ శబరిష్ తదితరులు పాల్గొన్నారు.

 

సీఎం రేవంత్ రెడ్డి సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, మేడారం గద్దెల సీఎం రేవంత్ రెడ్డి సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, మేడారం గద్దెల ప్రాంగణాన్ని ఆధునికరించే డిజిటల్ మ్యాప్ ను విడుదల చేయనున్నారు. జాతర నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రజా ప్రతినిధులు, భక్తులతో ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు…

Facebook
WhatsApp
Twitter
Telegram