దారుణం.. కూర వేయలేదని మహిళపై గొడ్డలితో దాడి

 

 

గోల్డెన్ న్యూస్ / ఖమ్మం : ఖానాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో దారుణం చోటుచేసుకుంది. కూర అడిగితే వేయలేదని మహిళపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు.

 

కిటికీలు తయారు చేసే కంపెనీలో పనిచేస్తున్న బానోత్ రుక్మిణీ అన్నం తింటుండగా రవి అనే కార్మికుడు కర్రీ అడిగాడు.

 

తన వరకే ఉందని చెప్పగా ఆగ్రహించిన రవి గొడ్డలితో ఆమె మెడపై పలుమార్లు దాడి చేసి పారిపోయాడు.

 

ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram