ప్రియుడి ఇంట్లో ఉరివేసుకొని వివాహిత ఆత్మహత్య మహిళ తన ఇంట్లో ఉందని తెలిస్తే పరువు పోతుందని భయపడి సహాయం కోసం ఎవరిని పిలవని యువకుడు
హైదరాబాద్ – నాగోల్ పరిధిలో నివాసముంటున్న బానోత్ అనిల్ నాయక్(24) అనే యువకుడితో పరిచయం ఏర్పడి, తనతో గడిపేందుకు నాగోల్ వచ్చిన మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామానికి చెందిన మహిళ(38)
తన కుమారుడు(3)కి చికిత్స చేయిస్తానని చెప్పి వచ్చి, రెండు రోజులు యువకుడి ఇంట్లోనే ఉన్న మహిళ
కూరగాయలకు వెళ్లి వచ్చేసరికి బాత్రూములో హ్యాంగర్‌కు చీరతో ఉరివేసుకుంటున్న మహిళను చూసి షాకైన అనిల్
చుట్టుపక్కన వారిని సహాయం కోసం పిలిస్తే పరువు పోతుందని, తానే తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లేసరికి తుదిశ్వాస విడిచిన మహిళ
భయంతో చేయి కోసుకొని ఆత్మహత్య చేసుకుందామని అనుకోగా, ఎదురుగా ఏడుస్తున్న మూడేళ్ల చిన్నారిని చూసి చేతికి గుడ్డ కట్టుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనిల్
నాగోల్ చేరుకుని అనిల్‌ను కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేసిన మహిళ బంధువులు, కుటుంబ సభ్యులు









