గోల్డెన్ భద్రాద్రి/ కొత్తగూడెం : తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అన్నారు. దసరా సంబరాల్లో భాగంగా మూడో రోజు జరుపుకునే ముద్దపప్పు బతుకమ్మ వేడుకలను మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, శిక్షణ కలెక్టర్ సౌరభ్ శర్మ హాజరై, మహిళా ఉద్యోగులతో కలిసి భక్తిశ్రద్ధలతో బతుకమ్మ పూజలో పాల్గొని ఆడిపాడారు.
Post Views: 44









