అనంతపురం జిల్లా, పామిడి మండలం, కలాపురంలో దారుణం చోటు చేసుకుంది. వైసీపీ యువనేత సతీష్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. బైక్ పై ఇంటికి వస్తుండగా గుర్తుతెలియని దుండగులు సతీష్ రెడ్డి గొంతు కోసి దారుణ హత్యకు పాల్పడ్డారు. ఇటీవలే వైసీపీ పార్టీ సతీష్ రెడ్డిని రూరల్ బూత్ కన్వీనర్ ప్రెసిడెంట్ గా నియమించింది. ఇంతలోనే సతీష్ రెడ్డి హత్య జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.
Post Views: 23









