సచివాలయం ముందు అంగన్వాడీ టీచర్ల ఆందోళన

తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదుట అంగన్వాడీ టీచర్లు ఆందోళన చేపట్టారు. వారు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరితే అరెస్టులు చేయడమేమిటని వారు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సులోనే సచివాలయానికి చేరుకుని, అదే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం విశేషం.

 

దీంతో పోలీసులు స్పందించి ఆందోళన చేస్తున్న అంగన్వాడీ టీచర్లను అదే ఉచిత బస్సుల్లో పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరోవైపు, ప్రభుత్వం తీసుకున్న ప్రీ ప్రైమరీ స్కూల్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు చెన్నూర్ ఎమ్మెల్యే, మంత్రి వివేక్ వెంకటస్వామి నివాసాన్ని ముట్టడించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram