ప్రేమ వివాహం చేసుకున్న కూతురిని కిడ్నాప్ చేసిన పేరెంట్స్

జోక్యం చేసుకున్న యువకుడి కుటుంబ సభ్యులపై యువతి బంధువులు దాడి చేసి, వారి కళ్ళలో కారం పొడి విసిరారు.

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కీసరలో నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ప్రవీణ్ , శ్వేత

 శ్వేత బంధువులు ప్రవీణ్ ఇంటిపై దాడి చేసి ఆమెను అపహరించారు.

అడ్డుకోవడానికి ప్రయత్నించిన ప్రవీణ్ కుటుంబ సభ్యులపై శ్వేత బంధువులు కారం పొడి చల్లి దాడి చేశారు.తమ ఇష్టానికి వ్యతిరేకంగా కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని.. ఆమె తల్లిదండ్రులు పగబట్టారు. అంతేనా.. కూతురి అత్తింటి వారిపై మూకుమ్మడిగా దాడి చేశారు. అడ్డొచ్చిన కూతురిని బయటకు ఈడ్డుకుంటూ తీసుకొచ్చి.. ఆమె చేతులు, కాళ్లకు తాడు కట్టి కారులో పడేసి ఎత్తుకెళ్లిపోయారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ కిడ్నాప్‌కు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ అమానుష ఘటన బుధవారం (సెప్టెంబర్‌ 24) నగర శివారులోని కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

ప్రవీణ్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram