గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్, : తెలంగాణ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ మద్యం పాలసీని ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్ చివరి నాటికి ముగియనున్న ఎ 4 మద్యం షాపుల కేటాయింపుకు గురువారం షెడ్యూల్ ఖరారు చేస్తూ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని మద్యం షాపుల లైసెన్సుల ఖరారు కోసం ఈనెల 26 (శుక్రవారం) నుంచి టెండర్ల స్వీకరణకు ఆదేశాలు జారీ చేసింది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో రూ. 3 లక్షలకు ఒక టెండర్ ఫారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 18 వరకు టెండర్ల స్వీకరణ జరుగుతుంది.అక్టోబర్ 23న లక్కీ డ్రా ల ద్వారా మద్యం షాపులకు లైసెన్సులను కేటాయిస్తారు. కొత్త మద్యం పాలసీ లోను ఎస్సీ, ఎస్టీ,గౌడ కులస్తులకు మద్యం షాపుల కేటాయింపులకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. లక్కి డ్రా ద్వారా మద్యం షాపులు దక్కించుకున్న వారు నుంచి అమ్మకాలు చేయాల్సి ఉంటుంది. కొత్త ఎక్సైజ్ మద్యం పాలసీ ద్వారా టెండర్ల నుంచి దాదాపు రూ. 2000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.









