గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర డీజీపీగా 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విధులు నిర్వహిస్తున్న శివధర్ రెడ్డి, అక్టోబర్ 1 నుంచి డీజీపీ బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణలో కీలక అనుభవం ఉన్న శివధర్ రెడ్డి నియామకం పోలీసు శాఖలో కొత్త ఉత్తేజాన్ని నింపుతుందని అధికారులు భావిస్తున్నారు. లెఫ్ట్-వింగ్ ఎక్స్‌ట్రీమిజం (LWE) ని అణచివేయడంలో ఉగ్రవాద కదలికలను ఛేదించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ, ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ వంటి అనేక పురస్కారాలు అందుకున్నారు.
Post Views: 35









