గ్రామపంచాయతీ ఎన్నికల పై ప్రొసీడింగ్ అధికారులకు శిక్షణ.

గోల్డెన్ న్యూస్ /పినపాక :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్డు లోని జీవిఆర్ ఫంక్షన్ హాలులో శనివారం గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల ప్రొసీడింగ్ అధికారుల కోసం ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఈ సమావేశానికి మండల ప్రత్యేక అధికారి ఏడిఏ తాతారావు, ఎంపీఓ వెంకటేశ్వరరావు హాజరై ప్రసంగించారు. అధికారులు ఎన్నికల విధివిధానాలను పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉందని వారు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అనుసరించాల్సిన నిబంధనలు, ఓటర్ల గుర్తింపు, ఓటింగ్ ముగిసిన తర్వాత చేపట్టాల్సిన ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై నిపుణులు వివరణాత్మకంగా వివరించారు. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి తప్పిదాలు జరగకుండా ప్రతీ అధికారి అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతీ ఓటు విలువైనదని గుర్తుచేస్తూ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో పినపాక ఎంఈఓ నాగయ్య, కరకగూడెం ఎంఈఓ, మండల అధికారులతో పాటు ప్రొసీడింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram