క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి

క్రీడలను ప్రారంభించిన ఏటూరునాగరం ఐటిడిఎ డిఎంహెచ్ఓ కోరం క్రాంతికుమార్

గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలని ఏటూరునాగారం ఐటిడిఎ డిఎంహెచ్ఓ కోరం క్రాంతికుమార్ 

గోల్డెన్ న్యూస్ / తాడ్వాయి:  ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని రంగాపురం పాఠశాల  మైదానం నందు ఆదివారంకరకగూడెం,పినపాక,మణుగూరు,ఆళ్ళపల్లి,గుండాల,తాడ్వాయి ఏడు స్థాయి విపిఎల్-5 ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్ ను బ్రహ్మాండంగా ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఏజెన్సీలో అణిముత్యం లాంటి క్రీడాకారులు ఉన్నారని,గ్రామంలో ఉన్న క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయాలంటే ఇలాంటి క్రీడలు నిర్వహించాలని తెలిపారు. ఐపీఎల్ తరుణంలో పట్టణంలో జరిగే ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్ మా ప్రాంతంలో నిర్వహించడం గొప్ప ఆలోచన అని మేనేజ్మెంట్ వారిని అభినందించారు.మొదటి మ్యాచ్ కళ్యాణ్-11,రెండోవ మ్యాచ్ సీఎస్కే-11 ప్రాంచెస్ జట్లు గెలిచి,మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆవార్డ్స్ అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఇర్ప సూర్యం,చెన్నూరు శేషుబాబు, గుమ్మడి ముత్తయ్య,దాసరి శివానందు,రామనాథం,వెంకన్న,స్వామి టోర్నీ నిర్వహకులు రంజిత్,సుధాకర్,గోపి,శివ,రామక్రిష్ణ తదితరులు పాల్గోన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram