గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : తెలంగాణలో రాగల రెండురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. పశ్చిమ విదర్భ, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం దాదాపు పశ్చిమ దిశకు కదిలి అల్పపీడనంగా బలహీనపడిందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ క్రమంలో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
Post Views: 28









