గోల్డెన్ న్యూస్/ తెలంగాణ : మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలో నకిలీ నోట్ల వ్యవహారం కలకలం రేపింది. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కారులో నకిలీ నోట్లను మార్పిడి చేస్తుండగా స్థానికులతో వివాదం తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్లు ‘చిల్డ్రన్ బ్యాంకు’ పేరుతో ముద్రించినట్లు ప్రాథమిక సమాచారం.
Post Views: 27









