జోరుగా కల్తీ నూనెల విక్రయాల దందా

గోల్డెన్ న్యూస్ / మంచిర్యాల : జిల్లాలో కల్తీ నూనెల విక్రయాల దందా జోరుగా సాగుతోంది.

 

నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న ప్రజలు కల్తీ నూనెలతో మరింత ఇబ్బందులు పడుతున్నారు.

 

అసలు నూనె ఏదో, కల్తీ నూనె ఏదో తెలియక ప్రజలు అయోమయంలో పడుతున్నారు.

 

కొందరు వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ, కొత్త పేర్లతో కల్తీ నూనెలను అమ్ముతున్నారు.

 

కల్తీని అరికట్టాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.

 

మంచిర్యాల జిల్లా కేంద్రంగా బెల్లంపల్లి పరిసర ప్రాంతాలకు హోల్‌సేల్ అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం.

Facebook
WhatsApp
Twitter
Telegram