అమల్లోకి ఎన్నికల కోడ్.. మీ వద్ద అంతకు మించి ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా సీజ్..!

తెలంగాణ పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల జాతర ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఐదు దశల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. నేటి నుంచే ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. కోడ్ ముగిసే వరకు రూ. 50 వేలకు మించి నగదు తీసుకెళ్లడంపై ఆంక్షలున్నాయి. సరైన పత్రాలు లేని నగదును అధికారులు సీజ్ చేసి, ఐటీ అధికారులకు సమాచారం అందిస్తారు. ప్రజలు తగిన ఆధారాలు వెంట ఉంచుకోవాలని సూచించారు.

తెలంగాణ పల్లెల్లో ఎన్నికల జాతర ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేశారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో మొత్తం ఐదు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే ప్రారంభమవుతుంది. మెుత్తం ఐదు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీడీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రక్రియ నవంబర్ 11తో ముగుస్తుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచే ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది.ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఆంక్షలు ఉంటాయి. 

Facebook
WhatsApp
Twitter
Telegram