జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : విజయదశమి పర్వదినం సందర్భంగా భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి బాటిల్ ప్రజలందరికీ  శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ విజయదశమి పండుగ అనేది ప్రజలు అత్యంత భక్తి, శ్రద్ధలతో జరుపుకునే ముఖ్యమైన పర్వదినమని, ఇది ధర్మం చెడుపై గెలిచిన శుభసూచకమని తెలిపారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు దుర్గాదేవి తొమ్మిది రూపాలను ఆరాధించడం విశేషమని, విజయదశమి పర్వదినం సమాజంలో ధర్మం, న్యాయం మరియు సత్యానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

 

జిల్లా ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని, అదేవిధంగా జిల్లా అభివృద్ధి బాటలో ముందుకు సాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రతి ఇంటిలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, సిరిసంపదలు నిండాలని, దుర్గామాత ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram