ప్రియుడి ఇంటి ఎదుట మూడు నెలలుగా నిరసన చేస్తున్న ప్రియురాలు మృతి

గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లెలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి ఇంటి ఎదుట మూడు నెలలుగా నిరసన చేస్తున్న యువతి మృతిచెందింది.

వివరాల్లోకి వెళితే.. పాల్వంచకు చెందిన ప్రియాంక అనే యువతి.. గట్టు మండలం చిన్నోనిపల్లెకు చెందిన కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్‌తో ప్రేమలో పడింది. కొన్నాళ్ల పాటు ఇద్దరూ సంతోషంగానే కొనసాగారు. అనూహ్యంగా రఘునాథ్ గౌడ్‌ దూరం పెట్టడంతో భరించలేకపోయిన ప్రియాంక.. రఘునాథ్ ఇంటికి వచ్చింది. పెళ్లి చేసుకోవాలని అడిగింది. దానికి రఘునాథ్ నిరాకరించారు. దీంతో చేసేదేంలేక ప్రియుడి ఇంటి ఎదుటే ప్రియాంక నిరసనకు దిగింది. ఒక్క రోజు కాదు.. రెండ్రోజులు కాదు.. ఏకంగా మూడు నెలల పాటు ప్రియాంక నిరసన చేసింది. అయినా రఘునాథ్ కనికరించలేదు. అనూహ్యంగా ఇవాళ ప్రియాంక ప్రియుడి ఎదుట అనుమానాస్పదంగా మృతిచెందింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. రఘునాథ్ బంధువులే మా బిడ్డను చంపేశారని.. ప్రియాంక తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram