గోల్డెన్ న్యూస్ / ప్రొద్దుటూరు : కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో కన్నతల్లిని ఓ కొడుకు గొంతు కోసి హతమార్చిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు వివరాల మేరకు… ప్రొద్దుటూరుకు చెందిన లక్ష్మీదేవిని ఆమె కుమారుడు యశ్వంత్ తెల్లవారుజామున దారుణంగా హత్య చేశాడు. యశ్వంత్ హైదరాబాద్‌లో ఉంటున్నాడు.ఆదివారం రోజు తెల్లవారుజామున ప్రొద్దుటూరుకు వచ్చిన యశ్వంత్ ఇంట్లోకి వెళ్లి తల్లి లక్ష్మీదేవి గొంతు కోశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని గొంతు కోసిన స్థితిలోనే ఇంటి వరండాలోకి ఈడ్చుకొని వచ్చి పడేశాడు ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని. యశ్వంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా యశ్వంత్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.









