జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత పై క్రిమినల్ కేసు

 జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్‌పై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. మధురా నగర్ పోలీస్ స్టేషన్‌లో జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజినీకాంత్ రెడ్డి నవీన్ యాదవ్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నవీన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నవీన్ యాదవ్‌ ఓటర్ కార్డులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.కోడ్ అమల్లో ఉండగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి చర్యగా భావించిన ఎన్నికల సంఘం 

నవీన్ యాదవ్ మీద బీఎన్ఎస్ 170, 171, 174తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు.

Facebook
WhatsApp
Twitter
Telegram