గిరయ్య గుట్ట గ్రామస్తులకు సర్పంచ్ ఆశావహుడి ఆఫర్
తనను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి రూ. 25 లక్షలు విరాళం ఇస్తానంటూ గిరాయ గుట్ట తండా పాత్లవత్ నూరియా నాయక్ ఆఫర్ ప్రకటించాడు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా ఫరక్ నగర్ మండల పరిధిలోని గిరయ్యగుట్ట తండా గ్రామ పంచాయతీలో దాదాపుగా 550 మంది ఓటర్లు ఉండగా రిజర్వేషన్ ఖరారైంది.. సర్పంచ్ గా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి రూ. 25 లక్షలు విరాళంగా ఇస్తానని గిరాయగుట్ట, నా గర్లగడ్డ తండాలకు అభివృద్ధి చేసి చూపిస్తానని గ్రామానికి చెందిన రైతు పాత్లవత్ నూరియా నాయక్ తెలిపారు. తనకు ఏ పార్టీలతో సంబంధం లేకుండా వేదికగా ప్రకటించాడు. అయితే గ్రామ ప్రజలు అందరూ కలిసి దీనిపై గ్రామస్తులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి..
Post Views: 33









