ఢిల్లీలో జరిగిన 20వ FICCI ఉన్నత విద్యా సదస్సులో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ రాబోయే 4 నుంచి 6 నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ధరలు పెట్రోల్ వాహనాల ధరకు సమానంగా మారతాయని తెలిపారు. ఐదేళ్లలోపు భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ 1గా మార్చడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ ఇందులో మూడో స్థానంలో ఉందని ఈవీల ధరలు సాంప్రదాయ వాహనాల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
Post Views: 31









