ఓబీ కంపెనీలలో పూర్తిస్థాయి రక్షణ సూత్రాలు అమలు చేయాలి
ఫిట్నెస్ యంత్రాలనే నడపాలి
ప్రజాస్వామిక పద్ధతిలో నాయకులకు పాత్రికేయులకు సందర్శనకు అనుమతి ఇవ్వాలి
కర్నే బాబురావు డిమాండ్
గోల్డెన్ న్యూస్ / మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియాలో పనిచేస్తున్న ఓబీ కంపెనీలలో పూర్తిస్థాయి రక్షణ సూత్రాలు అమలు చేయాలని ఫిట్నెస్ అయిన యంత్రాలను మాత్రమే నడిపేలా చూడాలని ప్రజాస్వామ్య పద్ధతిలో కార్మిక సంఘాల నాయకులు గాని పాత్రికేయులు గాని సమస్య ఉన్నప్పుడు ఆయా ప్రాంతాలను సందర్శించే విధంగా సింగరేణి యాజమాన్యం చర్యలు చేపట్టాలని కోరుతూ సామాజిక సేవకులు కర్నే బాబురావు మంగళవారం నాడు ఏరియా సేఫ్టీ ఆఫీసర్ డి. వెంకట రామారావుకి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ మల్లెపల్లి ఓసి లో ఇటీవల మట్టి వెలికితీత పనుల కాంట్రాక్ట్ పొందిన గౌరవ్ ఓబి కంపెనీ పూర్తిస్థాయి కండిషన్ లో ఉన్న భారీ యంత్రాలను ప్రవేశపెట్టాల్సి ఉంది అందుకు విరుద్ధంగా సర్వేడ్ ఆఫ్ అయిన యంత్రాలను, మరమ్మతులకు వచ్చిన యంత్రాలను ప్రవేశపెట్టి వాటికి ఎలాంటి ఫిట్నెస్ లేకుండా క్వారీలో నడుపుతున్నారని ఫలితంగా అట్టి యంత్రాలు క్వారీలో ఎక్కడ పడితే అక్కడే ఆగిపోతున్నాయి నడవడానికి మోరాయిస్తున్నాయన్నారు వాటిని గ్యారేజీకి తరలించాలంటే కొన్ని గంటల సమయం పడుతోంది వేరే వెహికల్ పెట్టి లాగించుకొని పోవాల్సిన పరిస్థితి కండిషన్లో లేని యంత్రాలను నడిపే ప్రయత్నంలో భాగంగా ప్రమాదాలకు కూడా అవకాశం ఉంది ఈ అంశంపై యాజమాన్యం తక్షణ విభాగం ఆధ్వర్యంలో తనిఖీ కార్యక్రమం ఏర్పాటు చేయాలని కోరుతున్నాను అదేవిధంగా గౌరవ్ ఓబి కంపెనీ దగ్గరకి కార్మిక సంఘాలు యూనియన్ లీడర్లు జర్నలిస్టులు సందర్శనకు వెళితే గేటు వద్ద సెక్యూరిటీ గార్డులు అన్ని సరిగా ఉంటే గౌరవం ఓబి యాజమాన్యానికి ఎందుకు అంత ఉలుకు అనేది అర్థం కావడం లేదు దయచేసి అలాంటి సంఘటనలు పునరావతం కాకుండా ప్రజాస్వామ్యక పద్ధతుల్లో ఎవరికి ఇబ్బంది కలిగించకుండా చూసే విధంగా గౌరవ ఓబి కంపెనీ యాజమాన్యానికి తగు ఆదేశాలు జారీ చేయవలసిందిగా కోరారు..
గౌరవ్ ఓబి కంపెనీలో కండిషన్లో ఉన్న భారీ యంత్రాలను, వాహనాలను మాత్రమే అనుమతించాలి
రక్షణ విభాగం ఆధ్వర్యంలో అన్ని యంత్రాలను తనిఖీ చేయాలి
మెడికల్ విటిసి సంబంధిత యంత్రాలపై శిక్షణ లేకుండా ఎవరిని అనుమతించరాదు వీటికి శిక్షణ సమయంలో డ్యూటీ లకు అనుమతించరాదు
డీజీఎంఎస్ గైడ్ లైన్స్ మరియు కోల్ మైన్స్ రెగ్యులేషన్ ప్రకారం (సి ఎం అర్)సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు హాల్ రోడ్ లను, వ్యక్తిగత రక్షణ పరికరాల ధరింపు, మద్యపానం, ఇతర మత్తు పదార్థాల సేవింపు, సీట్ బెల్ట్ ధరింపు, సెల్ ఫోన్ డ్రైవింగ్ పై అవగాహన, అగ్ని ప్రమాదాలు , ప్రాథమిక వైద్యం,క్యాంటీన్లో పరిశుభ్రతను రక్షణ సూత్రాలు అమలు లైటింగ్ మరియు గ్యారేజీలో ప్రతిరోజు రక్షణ తనిఖీ నిర్వహించాలి, ఎండి ఆదేశానుసారం ప్రతిరోజు ఎస్ఓపి కార్యక్రమం రక్షణ ప్రతిజ్ఞ క్రమం తప్పకుండా నిర్వహించాలి దీనిపై అధికారుల మరియు హెడ్ ఓవర్ మెన్ ల పర్యవేక్షణ తప్పకుండా ఉండాలి రిజిస్టర్లలో నమోదు చేయాలి ఏరియా సేఫ్టీ ఆఫీసర్ కూడా వారానికి ఒకసారి తనిఖీ నిర్వహించాలి వినతిపత్రంలో కోరినట్లు ఆయన తెలిపారు.









