అమెరికాలో స్థిరపడిన గుంటూరు వైద్యురాలు డాక్టర్ ఉమా గవిని ఔదార్యం
గోల్డెన్ న్యూస్ / గుంటూరు : యాభై ఏళ్లుగా కష్టపడి కూడబెట్టిన తన యావదాస్తినీ తృణప్రాయంగా దానం చేసేశారు ఒక మహిళా వైద్యురాలు. కర్ణుడి దానగుణాన్ని వర్ణించిన మహాభారత ఘట్టాన్ని ఆధునిక భారతంలో గొప్పగా ఆవిష్కరించారు.
భర్త మూడేళ్ల కిందట మృతి చెందటం, వారసులు లేకపోవడంతో డాక్టర్ ఉమ గవిని తన ఆస్తినంతా గుంటూరు జీజీహెచ్‌కు ఇచ్చేశారు. చివరికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మిగుల్చుకోలేదు.
మొత్తం రూ.20 కోట్ల ( 2.50 లక్షల డాలర్లు ) ఆస్తిని జీ.జీ.హెచ్ లో కొత్తగా నిర్మిస్తున్న మాతా శిశు సంక్షేమ భవనానికి విరాళంగా ప్రకటించారు.
గుంటూరు జిల్లాకు చెందిన డాక్టర్ ఉమ ప్రస్తుతం అమెరికాలో ఇమ్యునాలజిస్ట్, ఎలర్జీ స్పెషలిస్టు గా పనిచేస్తున్నారు.
ఆమె గుంటూరు వైద్య కళాశాలలో 1965లో మెడిసిన్ చేశారు. అనంతరం ఉన్నతవిద్య పూర్తి చేసి నాలుగు దశాబ్దాల కిందట అమెరికా వెళ్లిన సూపర్ స్పెషలిటీ డాక్టర్









