గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు మరో లంచం కేసును బయటపెట్టారు. TGSPDCL పద్మారావు నగర్ సబ్‌డివిజన్ పరిధిలోని లాలగూడ సెక్షన్ సబ్ ఇంజనీరు & ఇన్‌చార్జి సహాయక ఇంజనీరు భూమిరెడ్డి సుధాకర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఎసిబి అధికారుల చెరలో చిక్కారు.
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి … ఫిర్యాదుదారుడు చేపట్టిన విద్యుత్ కాంట్రాక్ట్ పనికి సంబంధించిన స్థలంలో సింగిల్ ఫేజ్ మీటర్లను త్రీ ఫేజ్ మీటర్లకు ఆధునికీకరించడం కోసం సంబంధిత దస్తావేజులను ప్రాసెస్ చేయడంతో పాటు 63 KVA ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు అంచనా ప్రతిని సిద్ధం చేయడానికి భూమిరెడ్డి సుధాకర్ రెడ్డి రూ.15,000 లంచం కోరినట్లు తెలుస్తోంది.
ఫిర్యాదుదారు ఈ విషయాన్ని తెలంగాణ అవినీతి నిరోధకశాఖకు ఏసీబీ సమాచారం అందించడంతో, అధికారులు ఏర్పాటుచేసిన ఉచ్చులో సుధాకర్ రెడ్డి చిక్కాడు. ఎసిబి అధికారులు నిందితుడిపై కేసు నమోదు చేసి, విచారణ కొనసాగిస్తున్నారు.









