గోల్డెన్ న్యూస్ /నల్లబెల్లి : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గోవిందాపురం ఫారెస్ట్ బీటు అధికారి శోభన్ బాబును పోడు దారులతో కుమ్మక్కై అడవిని నరికి కొత్తగా పోడు చేయించడంలో ప్రమేయం ఉన్నట్లు అభియోగాలపై గురువారం సస్పెండ్ చేశారు. నర్సంపేట ఎస్ఆర్వో రవికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం, కొందరు పోడు రైతులతో మాట్లాడి నగదు ఇచ్చినట్లు వాంగ్మూలం తీసుకోవడంతో పాటు విచారణ జరిపి, జిల్లా అటవీశాఖ అధికారి అనూజ్ అగర్వాల్ కు నివేదిక సమర్పించారు. అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి బీటు అధికారి శోభన్ బాబును విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Post Views: 60









