సైబర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్‌..

59 మంది నిందితుల అరెస్ట్

గోల్డెన్ న్యూస్ /తెలంగాణ : సినిమాల పైరసీ గ్యాంగ్‌ పై తెలంగాణ సైబర్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. వివిధ ఆపరేషన్ల ద్వారా 8 రాష్ట్రాల్లోని 59 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు సెప్టెంబర్‌- 2025లో నమోదైన సైబర్ కేసులు, అరెస్ట్ వివరాలు వెల్లడించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. సెప్టెంబర్‌లో మొత్తం రూ.86,64,827లను బాధితులకు రిఫండ్ చేశారు సైబర్ పోలీసులు. సెప్టెంబర్‌లో 320 NCRP ఫిర్యాదులు నమోదయ్యాయి.

 

దేశవ్యాప్తంగా 257 కేసులు..

 

320 కేసుల్లో 222 కేసులు సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లలో.. మరో 106 కేసులు జోనల్ సైబర్ స్టేషన్‌‌లలో నమోదయ్యాయి. ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ – 28, డిజిటల్ అరెస్ట్ -6, పార్ట్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్- 4 , మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ కేసులు- 2 , క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ – 4, మూవీ పైరసీ – 3, జాబ్ ఫ్రాడ్ – 1, ట్రేడింగ్ ఫ్రాడ్ – 1, సోషల్ మీడియా ఫ్రాడ్స్ – 4, ఇతర కేసులు -2 నమోదయ్యాయి. 59మంది నిందితులపై దేశవ్యాప్తంగా 257 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మూవీ పైరసీ గ్యాంగుపై 74 కేసులు నమోదైనట్లు వెల్లడించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.

 

ఈ వెబ్‌సైట్ల ద్వారా చిత్రాల లీక్..

 

నిందితుల దగ్గరి నుంచి మొబైల్ ఫోన్లు -43, చెక్ బుక్స్ -9, పాస్‌బుక్స్ , 23 డెబిట్ కార్డులు , ల్యాప్ ట్యాప్‌లు – 4, సిమ్ కార్డులు – 21, షెల్ కంపెనీ స్టాంప్- 1 స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మూవీలను పైరసీ చేస్తున్న ఐదుగురు నిందితులని అరెస్ట్ చేశారు సైబర్ పోలీసులు. సింగల్, హిట్ ది థర్డ్ కేసు, కుబేర సినిమాల పైరసీ కేసుల్లో ఐదుమంది నిందితులని అరెస్ట్ చేశారు. నిందితులు తెలంగాణ, తమిళనాడు, బీహార్, ఆంధ్రప్రదేశ్, గోవా రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. 1Tamil Blasters, 5Moviez Rulz వంటి వెబ్‌సైట్ల ద్వారా పలు చిత్రాలను లీక్ చేస్తోంది ఈ మూవీ పైరసీ ముఠా. నిందితుల దగ్గర ఉన్న సీపీయూలు, ల్యాప్‌ట్యాప్స్, మొబైల్స్, హార్డ్‌ డిస్క్‌లని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేశారు.

 

రిటైర్డ్ డాక్టర్‌‌కి బెదిరింపులు..

 

మరోవైపు. సెప్టెంబర్‌‌లో డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.6,6000 కాజేసిన గ్యాంగ్‌ని అరెస్ట్ చేశారు హైదరాబాద్ సైబర్ పోలీసులు. మలక్‌పేటకు చెందిన రిటైర్డ్ డాక్టర్‌ని డిజిటల్ అరెస్ట్ పేరిట బెదిరింపులకి దిగారు. మానసిక ఒత్తిడితో గుండెపోటుకు గురై మరణించారు డాక్టర్.మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులని అరెస్టు చేశారు సైబర్ పోలీసులు. మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ పేరుతో రూ.25 లక్షల మోసం చేశారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ‘Khoobsurat.Rishte’ ద్వారా వివాహం పేరుతో మోసం చేశారు. నిందితులు అనిశా మొహమ్మద్ యాసీన్, జోహర్ ఫాతిమా (కర్ణాటక), మహమ్మద్ అబ్దుల్ అమిర్‌ని (హైదరాబాద్) అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి మొబైల్ ఫోన్లు – 2, ట్యాబ్ – 1, ల్యాప్‌ట్యాప్ – 1, పాస్‌బుక్స్ – 5, చెక్‌బుక్స్ – 3, డెబిట్ కార్డులు – 3 హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram