బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో పిటిషన్

గోల్డెన్ న్యూస్/ తెలంగాణ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టే ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు న్యాయ సలహాదారులతో చర్చలు జరిపింది. స్టే ఎత్తి వేయాలని సుప్రీంకోర్టులో ఈ రోజు పిటిషన్ దాఖలు చేయనుంది. రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు తీర్పుతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం కుల గణన చేపట్టి అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. దానికి అనుగుణంగా జీవో నెంబర్ 9 జారీ చేసింది.

Facebook
WhatsApp
Twitter
Telegram