పతకాలు సాధించిన అధికారులను అభినందించిన పోలీస్ కమిషనర్
గోల్డెన్ న్యూస్ / ఖమ్మం : 2024 -25 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం మరియు నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీసు సేవా పతకాలలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అందించిన అత్యుత్తమ సేవలకు గాను పలువురు పోలీస్ సిబ్బందికి పతకాలు లభించాయి. పతకాలు పొందిన వారిలో అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు, టౌన్ ఏసీపీ రమణమూర్తి, సిసిఆర్బీ ఏసీపీ సాంబరాజు,తో పాటు పోలీస్ సిబ్బంది వున్నారు. మహోన్నత సేవ పతకం (01) ఉత్తమ సేవ పతకం (05) సేవ పతకం (64) ఉత్కృష్ట పతకాలు (12) సాధించారు. ఈ నేపథ్యంలో మంగళవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చేతుల మీదుగా 82 మంది పోలీస్ సిబ్బందికి పతకాలు అందజేసి అభినందించారు. ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఏ ఆర్ ఏసీపీ నర్సయ్య, ఆర్ఐ కామరాజు పాల్గొన్నారు..









