కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ సిపి కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన

గోల్డెన్ న్యూస్, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పై సీఎం రేవంత్ రెడ్డి పై ఇష్టం వచ్చినట్టుగా పోస్ట్లు పెట్టడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సిపి కార్యాలయం వద్దకు చేరుకొని కేటీఆర్ డౌన్డౌన్ వద్దకు చేరుకొని కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ శ్రేణులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆందోళన చేస్తున్న కార్యకర్తలను అక్కడ బందోబస్తు చేస్తున్న పోలీసులు సమీప పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ పోస్ట్ పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీపీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో రామ్మూర్తి గోపి బల్మూరి వెంకట్ తో పాటు గడుగు గంగాధర్, మానాల మోహన్ రెడ్డి, తాహెబ్ బిన్ హందన్, మోహన్ రెడ్డి, కేశ వేణు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్ తాహెర్ బిన్ హందన్ తదితరులు పాల్గొన్నారు, జివి రామకృష్ణ, రామ్మూర్తి గోపి తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram