గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : భద్రాచలం డిప్యూటీ డి ఎం హెచ్ ఓ చైతన్య కరకగూడెం ప్రాథమిక వైద్యశాలను గురువారం సందర్శించారు. రోగుల ఆరోగ్య నిర్వహణ రికార్డులు, రక్త పరీక్షలు, మందులు, డెలివరీకి సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించి వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. రికార్డులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పారు. ఆసుపత్రిలోని ఇతర వసతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ప్రభుత్వ వైద్యశాలలో ప్రసూతి వైద్య సేవలను మెరుగుపరచాలని, సాధారణ కాన్పులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని అన్నారు గ్రామాలలో వైద్య శిబిరాలు నిరంతరం నిర్వహించాలని సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. పి హెచ్ సి వైద్యులు రవితేజ కు సూచించారు.
ఈ కార్యక్రమంలో cho శ్రీనివాస్, dmho,heo గొంది వెంకటేశ్వర్లు, heo కృష్ణయ్య, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









