గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అశ్వాపురం పాడు గ్రామంలో అటవీ శాఖ అధికారులపై దాడి చేసిన ఆదివాసీలు.
అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం. శుక్రవారం అశ్వాపురంపాడు అటవీ ప్రాంతంలో వలస ఆదివాసీలు పోడు భూమిలో వరి పంట వేశారు. వరిని కోసేందుకు వరి కోత మిషన్ (harvester ) అడవిలోకి తీసుకొని రాగా అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. భారీ వాహనం అడవిలకి అనుమతి లేదని వారించారు. ఈ క్రమంలో ఆ గ్రహించిన ఆదివాసీలు సెక్షన్ ఆఫీసర్ గోవిందు, బీట్ ఆఫీసర్ కోటేశ్ పై కొడవలితో దాడి చేశారు. దీంతో అధికారులకు స్వల్ప గాయాలు అయ్యాయి. దాడి చేసిన వారిపై కరకగూడెం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు తెలిపారు..
Post Views: 60









