గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తాటిగూడెం అంగన్వాడీ కేంద్రంలో ‘పోషణ వాటిక’లో భాగంగా శనివారం అధికారులు మోడల్ న్యూట్రిషన్ గార్డెన్ ఏర్పాటు చేశారు. మణుగూరు ఐసీడీఎస్ సీడీపీఓ పోలెబోయిన జయలక్ష్మి, ఇన్ఛార్జి ఎంపీడీఓ దేవ వరకుమార్ కలిసి గార్డెన్లో కూరగాయలు, ఆకుకూరల విత్తనాలను నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మారుతి, అనంతారం సెక్టార్ సూపర్వైజర్ రాజమణి, కరకగూడెం సెక్టార్ సూపర్ వైజర్ భద్రమ్మ, సూపర్ వైజర్ పద్మ, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 279









