గోల్డెన్ న్యూస్ /ఆంధ్రప్రదేశ్ : డిజిటల్ అరెస్టుల పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యులనే కాదు నేతలనూ వదలడం లేదు. టిడిపికి చెందిన ఓ ఎమ్మెల్యే సైతం రూ.1.07 కోట్లు సమర్పించుకున్నారు. ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామని, మీపై మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ వారెంట్ వచ్చిందని భయపెట్టారు. దీంతో సదరు ఎమ్మెల్యే డబ్బులు బదిలీ చేశారు. అయినా వదలకపోవడంతో ఆయన హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Post Views: 34









