ఉత్తర ప్రదేశ్ : మీర్జాపూర్‌కు చెందిన ఐదేళ్ల బాలిక సమయస్ఫూర్తితో తల్లి ప్రాణాలు కాపాడుకుంది. నిన్న తన తల్లి విషం తాగడంతో శివాణి ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్ 1090కు కాల్ చేసింది. వెంటనే సమీపంలోని పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడు ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. ఎమర్జెన్సీ సమయంలో హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేయాలని స్కూల్లో చెప్పారని ఆ బాలిక చెప్పడంతో ప్రశంసలు కురుస్తున్నాయి.
Post Views: 30









