ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు.
గోల్డెన్ న్యూస్ /కరకగూడెం,మాయ మాటలు, జిమ్మిక్కులతో రెండేళ్ళ పాటు తెలంగాణ కు ఎలాంటి ఇలాంటి అభివృద్ధి చేయకుండానే కాలం గడిపిస్తున్నాయని పినపాక మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆరోపించారు. కరకగూడెం మండల కేంద్రంలో ఆదివారం విలేకరుల ఏర్పాటుచేసి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలుచేయలేక కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తు కాలయాపన చేస్తుందని ఆయన మండిపడ్డారు. బీసీ 42 % రిజ ర్వేషన్ పేరుతో ప్రజలను మరోసారి మోసం చేసిందన్నారు.. ఇటీవల జరిగిన బీసీ బందులో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పాల్గొనడం హాస్యాస్పదమన్నారు. నా హయాంలోకరకగూడెం మండలంలో పులుసు బొంత ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.20 కోట్లు తీసుకొస్తే చేత కాని ఎమ్మెల్యే అప్పుడు చేయలేక పోయాడు. మరలా టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మారమూల గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సుమారు 200 వందల కోట్లకు ప్రతిపాదనాలు పంపించి ఆ టవీ శాఖకు భూములు కూడా ఏర్పాటు చేసి టెండర్ ప్రక్రియ ఫైల్ గత ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు తీసుకెళ్లాను. ఈ లోపు ఎన్నికల కోడ్ రావడంతో ఆ పనులు ఆగిపోయాయని గుర్తు చేశారు. ఈ నెల 27న జిల్లా వ్వాప్తంగా రహదారులపై ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.మాటలు చెప్పే సమయం ముగిసిపోయింది, ఇంకా మాటలు చెబితే ప్రజలు ఊరుకోరని, ఇప్పటికైనా మించిపోయింది లేదు, తక్షణం ఇచ్చిన హామలు పూర్తి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య. ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కొమరం రాం బాబు, రాష్ట్ర యువజన నాయకుడు లక్క మధు, సీనియర్ నాయకులు అక్కిరెడ్డి వెంక టరెడ్డి, బైరిశెట్టి చిరంజీవి, రేగా లక్ష్మణరావు, ఊకె రామనాధం, రేగా సత్యనారాయణ, క్రిష్ణ రావు, పాల్గొన్నారు.









